కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే... త్వరితగతిన టీకా కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ దాదాపు రూ. 742 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. బుధవారం నాటికి కొవిడ్ కేసుల సంఖ్య 3,63,380కి పెరిగినందున పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొవిడ్ కట్టడి దృష్ట్యా.... వృద్ధులకు, వైద్య సిబ్బందికి ముందుగా కరోనా టీకాలు అందించనునున్నట్లు ఓ పాకిస్థాన్ పత్రిక పేర్కొంది.
'ధర.. అంచనా వేయలేం!'
కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని పాక్ జాతీయ వ్యాక్సిన్ తయారీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ అసద్ హఫీజ్ అన్నారు. ఈ మేరకు.. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతోందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొవిడ్ వ్యాక్సిన్ ధర అంచనా వేయలేమని ఓ ఆరోగ్య శాఖ అధికారి అన్నారు. వ్యాక్సిన్ పూర్తిగా ఉచితంగా లభిస్తుందనే ఆశతో ఉండకూడదని పేర్కొన్నారు.
బుధవారం నాటికి పాకిస్థాన్లో 30,362 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 37 మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 7,230కి పెరిగింది.
ఇదీ చదవండి:బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు!