నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాల అమలులో విఫలమైన పాకిస్థాన్ వైమానిక సేవలపై.. 188 ప్రపంచ దేశాలు వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌లో చోటుచేసుకున్న లైసెన్సు కుంభకోణం నేపథ్యంలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)ను బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే నిషేధించాయి. పాక్ పైలట్లలో 30 శాతానికి పైగా విమానాలు నడిపేందుకు అర్హత లేనివారేనని.. వారిలో మూడింట ఒకరివి నకిలీ లైసెన్సులని పాక్‌విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌ఖాన్ జూన్‌లో స్వయంగా ప్రకటించారు.
పాకిస్థాన్ విమానాలపై 188 దేశాల వేటు! - pilots in pakistan
పాకిస్థాన్ విమాన సేవలపై 188 దేశాల వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భద్రతా ప్రమాణాలను పాటించడంలో దాయాది దేశం విఫలమైన నేపథ్యంలో ఐసీఏఓ హెచ్చరిక జారీ చేసినట్లు సమచారం. ఇప్పటికే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)ను బ్రిటన్, ఈయూ దేశాలు నిషేధించాయి.
పాకిస్థాన్ విమానాలపై 188 దేశాల వేటు!
అదే నెలలో వంద మందిని పొట్టన పెట్టుకున్న కరాచీ విమాన ప్రమాదానికి కూడా పైలట్ల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. విమాన ప్రయాణికుల భద్రతకుగాను అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ).. ఓ సురక్షితా విధానాన్ని ఆమోదించింది. ఈ ప్రమాణాలను పాటించటంలో విఫలమైన పీఐఏను.. ఐసీఏఓ తీవ్రంగా హెచ్చరించింది.