జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఎట్టకేలకు పాకిస్థాన్ ఒప్పుకొంది. సాక్షాత్ ఆ దేశ మంత్రి.. పార్లమెంట్లో ఈ మేరకు అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు.
"మేము భారత్‌ను వారి దేశంలోకి చొచ్చుకెళ్లి దెబ్బకొట్టాం. పుల్వామాలో గెలుపు.... ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలో ప్రజలు సాధించిన విజయం.
ఈ గెలుపులో మీరూ భాగమే. ఈ విజయంలో మనందరం భాగస్వాములమే."
- ఫవాద్ చౌదరి, పాకిస్థాన్ మంత్రి
పుల్వామాలో ఉగ్రదాడికి తాము బాధ్యులంకామంటూ అంతర్జాతీయ వేదికలపై ఇన్నాళ్లూ కల్లబొల్లి కబుర్లు చెప్పుకొచ్చింది పాకిస్థాన్. అయితే ఎట్టకేలకు పాక్ తన బండారాన్ని తానే బయటపెట్టుకుంది.
పుల్వామా దాడి...
జమ్ముకశ్మీర్ పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ బలగాల వాహన శ్రేణిని పేలుడుపదార్థాలు నింపిన కారుతో ఉగ్రవాదులు ఢీకొట్టారు. నాటి ఘటనలో 40 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారు. దీనికి ప్రతిగా భారత వాయుసేన 2019, ఫిబ్రవరి 26న పాకిస్థాన్ బాలాకోట్‌లోని జైషే మహ్మద్ స్ఠావరాలపై బాంబులు విసిరింది. ఈ ఘటనలో 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భారత వాయుసేన ప్రకటించింది.
ఇవీ చదవండి: