తెలంగాణ

telangana

ETV Bharat / international

వరుసగా రెండోరోజు పాక్​ కవ్వింపు చర్యలు

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. రాజౌరి జిల్లా నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లతో విరుచుకుపడింది దాయాది దేశం. భారత సైన్యం సమర్థంగా ప్రతిఘటించింది.

By

Published : Aug 8, 2019, 7:15 AM IST

వరుసగా రెండోరోజు పాక్​ కవ్వింపు చర్యలు

వరుసగా రెండోరోజు సరిహద్దు వెంట పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు పాల్పడింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అప్రమత్తమైన భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చింది.

బుధవారం రాత్రి 10 గంటల 15 నిమిషాల సమయంలో.. రాజౌరీ జిల్లా సుందర్​బనీ ప్రాంతం వద్ద పాకిస్థాన్​ దాడికి తెగబడినట్లు అధికారులు తెలిపారు. చిన్న చిన్న ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులు ప్రారంభించింది దాయాది దేశం. అప్రమత్తమైన భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పాక్​ సైన్యానికి దీటైన బదులిచ్చాయి.

నాలుగు రోజుల్లో మూడోసారి...

నియంత్రణ రేఖ వెంట పాక్​ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడటం గత నాలుగు రోజుల్లోనే ఇది మూడోసారి. ఆగస్టు 3న పుంఛ్​ జిల్లా మెహ్ధార్​ సెక్టార్​ లక్ష్యంగా కాల్పులు జరిపింది పాక్​.

గత నెలలోనూ దాయాది సైన్యం.. ​ కాల్పులకు ఇద్దరు భద్రతా సిబ్బంది, 10 రోజుల శిశువు బలయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details