జమ్ముకశ్మీర్ విషయంలో తటస్థంగా ఉండే దేశాల ప్రతినిధులను అక్కడికి అనుమతించాలని పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరీ తెలిపారు. కశ్మీర్లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, కశ్మీర్ ప్రజలతో మాట్లాడేందుకు ఐరాసకు చెందిన పరిశీలకులు, మానవ హక్కుల సంఘానికి చెందిన అధికారులు, అంతర్జాతీయ మీడియా సంస్థలను కశ్మీర్లోకి అనుమతించాలన్నారు.
ఈయూ, ఐఓసీ దేశాల రాయబారుల బృందం గురువారం కశ్మీర్లో పర్యటించిన అనంతరం హఫీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హఫీజ్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. కశ్మీర్, లద్దాఖ్లు భారత అంతర్భాగంలోనివని.. వీటిపై వ్యాఖ్యలు చేసేందుకు పాక్కు హక్కులేదని తేల్చి చెప్పింది. అయితే.. పాక్తో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటోందని అంతకు ముందు భారత్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ తెలిపారు.