రావల్పిండి నుంచి క్వెట్టాకు బయలుదేరిన జఫార్ రైలుపై దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. బలూచిస్థాన్ డేరా మురాద్ జమాలి ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు పదార్థాలు అమర్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
పాక్ జఫార్ రైలుపై దాడి - Railway track
పాకిస్థాన్ జఫార్ రైలుపై దుండగులు దాడి చేశారు. బలూచిస్థాన్‌లో రైల్వేట్రాక్‌పై అధునాతన పేలుడు పదార్థాలు పేల్చారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పాక్ జఫార్ రైలుపై దాడి
దాడిన ఖండించిన ప్రభుత్వం
దుండగుల దాడిని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి జామ్ కమల్ ఖాన్ అల్యానీ ఖండించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.