కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్ చర్యలు మొదలుపెట్టింది. ఒప్పందంలో భాగంగా చైనా నుంచి వాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి సమాయత్తమైంది. మొదటి దఫాగా 5 లక్షల డోసులను తీసుకురావడానికి ఆదివారం చైనాకు ప్రత్యేక విమానాన్ని పంపనున్నామని ఆ దేశ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సీఓసీ) తెలిపింది. జనవరి 31లోపు 5 లక్షల డోసులను అందించే విధంగా చైనాతో పాక్ ఒప్పందం కుదుర్చుకుంది. చైనీస్ సినోఫార్మ్ వాక్సిన్‌తో కలిపి రెండు కరోనా టీకాలను అత్యవసర వినియోగానికి పాక్ ఇప్పటికే అనుమతించింది.
'వాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇస్లామాబాద్‌లో టీకా నిల్వచేసి అన్ని రాష్ట్రాలకు అందించనున్నాం' అని ఎన్‌సీఓసీ వెల్లడించింది. మొదట ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు, వద్ధులకు వాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
17 లక్షల డోసులు..