తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​కు చైనా 210 కోట్ల డాలర్ల సాయం! - పాకిస్థాన్​

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​కు చేయూతనిచ్చేందుకు మిత్రదేశం చైనా సుముఖంగా ఉంది. పాక్​కు 2.1 బిలియన్​ డాలర్లు అప్పుగా ఇచ్చేందుకు సిద్ధమైంది. మసూద్​ అజార్​ అంశంలో పాకిస్థాన్​కు ​ మద్దతుగా వ్యవహరిస్తోన్న చైనా... ఆర్థికంగానూ బాసటగా నిలుస్తోంది.

పాక్​కు చైనా ఆర్థిక సాయం 2.1బిలియన్​ డాలర్లు

By

Published : Mar 23, 2019, 6:36 AM IST

Updated : Mar 23, 2019, 7:11 AM IST

పాక్​కు చైనా ఆర్థిక సాయం 2.1బిలియన్​ డాలర్లు
అప్పుల్లో కూరుకుపోయి ప్రభుత్వ ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమైన పాకిస్థాన్​కు 2.1 బిలియన్​ డాలర్లను రుణంగా ఇచ్చేందుకు చైనా అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య అధికారిక లాంఛనాలు పూర్తయ్యాయని పాక్ జాతీయ సలహాదారు ఖఖన్​ నజీబ్​ ఖాన్​ స్ఫష్టం చేశారు. పాకిస్థాన్​ జాతీయ బ్యాంకుకు మార్చి 25న చైనా నగదు బదిలీ చేస్తుందని తెలిపారు.

పాక్​ విదేశీ మారక నిల్వలను పెంచేందుకు గల్ఫ్​ దేశాలు సౌదీ అరేబియా, యూఏఈలూ చెరో బిలియన్​ డాలర్లు అందజేశాయి. కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది పాక్​.

పాకిస్థాన్​కు 6 బిలియన్​ డాలర్లు ఆర్థిక సాయంగా అందిస్తామని గతేడాది అక్టోబరులో సౌదీ ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక బిలియన్​ డాలర్లు అందజేసింది. ఆర్థిక సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్​)తోనూ చర్చలు జరిపింది పాక్​.

రుణ సదుపాయం కల్పిస్తే విదేశీ మారక నిలువలు బలపడటమే కాక, చెల్లింపుల స్థిరత్వంలో సమతుల్యత ఏర్పడుతుందని పాక్​ అధికార ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Mar 23, 2019, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details