పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిట్-బాల్టిస్థాన్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ఈ అంశాన్ని ఓ సీనియర్ మంత్రి వెల్లడించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపింది.
ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. త్వరలోనే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో పర్యటిస్తారని కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్థాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమిన్ గండాపుర్ పేర్కొన్నారు. అన్ని రకాల రాజ్యాంగ హక్కులతో పూర్తిస్థాయి రాష్ట్రహోదాపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలిపారు. జాతీయ అసెంబ్లీ, సెనేట్ సహా అన్ని రాజ్యాంగ సంస్థల్లో గిల్గిట్-బాల్టిస్థాన్‌కు తగిన ప్రాతినిధ్యం ఇస్తామన్నారు.
చైనా, పాకిస్థాన్ ఆర్థిక నడవా(సీపెక్) కింద మోక్‌పాండస్ ప్రత్యేక ఆర్థిక జోన్ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు గండాపుర్.