పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అణుయుద్ధం పేరిట భారత్‌ను బెదిరించే ప్రయత్నంలోని తన పాత పాటను అందుకుంది. ఆ దేశ ఫెడరల్ మంత్రి షేక్ రషీద్.. భారత్‌తో తలపడాల్సి వస్తే అణుయుద్ధం తప్పదని హెచ్చరించే ప్రయత్నం చేశారు. అయితే.. తమ వద్ద ఉన్న ఆయుధాలు ముస్లింలను రక్షిస్తాయని.. కొన్ని ప్రాంత్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొనటం గమనార్హం. అసోం కూడా.. తమ లక్షిత జాబితాలో ఉందని వెల్లడించారు.
ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు రషీద్.
" పాకిస్థాన్‌పై భారత్ దాడి చేస్తే.. సంప్రదాయ యుద్ధానికి అవకాశం లేదు. భయంకరమైన అణు యుద్ధమే జరుగుతుంది. మా వద్ద చిన్న, కచ్చితమైన, శక్తిమంతమైన ఆయుధాలు ఉన్నాయి. విస్పష్టంగా లక్ష్యాలను ఛేదించగలవు. మా ఆయుధాలు ముస్లింలను రక్షించి.. కొన్ని ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. అసోం కూడా ఇందులో ఉంది. సంప్రదాయ యుద్ధం చేసే ఆలోచన పాక్‌కు లేదు. అందువల్ల ఏదైనా జరిగితే అది ముగింపేనని భారత్‌కు తెలుసు."
- షేక్ రషీద్, పాక్ మంత్రి.