పాకిస్థాన్ దేశీయంగా అభివృద్ధి చేసిన 'ఫతా-1' క్షిపణి వ్యవస్థను గురువారం ప్రయోగించింది. 140కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. సంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లగలిగేలా దీనిని రూపొందించింది పాక్.
ఈ ప్రయోగ విజయంతో తమ ఆయుధ సామర్థ్యం మరింత పెరిగుతుందని పాకిస్థాన్ ఆర్మీ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్ తెలిపారు. శత్రు దేశాల భూభాగంలోని లక్ష్యాలను సైతం సులువుగా ఛేదించవచ్చని పేర్కొన్నారు.