పాకిస్థాన్ గురువారం మరో క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ బాబర్ మిసైల్.. ఉపరితలం నుంచి ఉపరితలంలోని 450 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదిస్తుందని పాక్ సైన్యం తెలిపింది. ఫలితంగా.. మూడు వారాల్లో ఆ దేశంలో ఇది మూడో క్షిపణి పరీక్ష కావడం విశేషం.
ప్రధాని, అధ్యక్షులు అభినందనలు..
అత్యాధునిక మల్టీ-ట్యూబ్ ప్రయోగ వాహనం నుంచి పరీక్షించిన బాబర్ క్షిపణి.. భూమి, సముద్రం వద్ద లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుందని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణి ప్రయోగ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు, రక్షణాధికారులు, ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ సభ్యులు పాల్గొన్నారు.