తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు- సైన్యంపై ఆరోపణ - కశ్మీర్

భారత్ నియంత్రణరేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. ఫలితంగా తమ దేశానికి చెందిన నలుగురు పౌరులు గాయపడ్డారని పాకిస్థాన్​ ఆరోపించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ.. ఇస్లామాబాద్​లోని భారత దౌత్యవేత్త అహ్లువాలియాకు సమన్లు జారీచేసింది.

కాల్పులకు తెగబడ్డారంటూ.. భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు

By

Published : Sep 8, 2019, 8:20 AM IST

Updated : Sep 29, 2019, 8:36 PM IST

భారత్​ నియంత్రణరేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్​ ఆరోపించింది. ఈ కాల్పుల్లో నలుగురు పాక్​ పౌరులు గాయపడ్డారని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇస్లామాబాద్​లోని భారత దౌత్యాధికారి అహ్లువాలియాకు సమన్లు జారీచేసింది.

పాక్ ఎలాంటి కవ్వింపు చర్యలు చేపట్టకపోయినా... భారత సైన్యం కాల్పులకు తెగబడిందని 'దక్షిణాసియా, సార్క్​ డైరెక్టర్​ జనరల్​' మొహమ్మద్​ ఫైసల్​ అన్నారు. పాకిస్థాన్​లోని ఖుయిరట్టాలో సెప్టెంబర్​ 6న 'కశ్మీర్​' ప్రజలకు సంఘీభావంగా శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న పౌరులపై భారత సైన్యం కాల్పులు జరిపిందని ఆరోపించారు. భారత దౌత్యవేత్త గౌరవ్​ అహ్లువాలియాను పిలిపించి... తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: గాంధీ 150: మహాత్ముడి స్మృతి వనం.. దిల్లీ ఆశ్రమం

Last Updated : Sep 29, 2019, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details