పాకిస్థాన్‌లోని గురుద్వారా నన్కానా సాహిబ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ.. పాక్ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత్ జారీ చేసిన సమన్లను తోసిపుచ్చింది పాక్. గురుద్వారా ఘటనపై భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చింది.
గురుద్వారాపై భారత్‌వి నిరాధార ఆరోపణలు: పాక్ - Pak summons Indian Charge d'Affaires Gaurav Ahluwalia
నన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడి విషయంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో దాయాది దేశం స్పందించింది. ఈ ఘటనపై భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని ప్రకటించింది.
![గురుద్వారాపై భారత్‌వి నిరాధార ఆరోపణలు: పాక్ Pak summons Indian Charge d'Affaires Gaurav Ahluwalia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5631671-90-5631671-1578419841003.jpg)
గురుద్వారాపై భారత్‌వి నిరాధారమైన ఆరోపణలు
కశ్మీర్ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భారత్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని.. పాక్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతిపౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని తెలిపింది పొరుగుదేశం. ఎటువంటి వివక్ష చూపకుండా మైనారిటీల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చింది.
ఇదీ చూడండి:పాక్ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత్ సమన్లు