తెలంగాణ

telangana

ETV Bharat / international

జర్నలిస్టు హత్యకేసులో సుప్రీంకోర్టు​ కీలక తీర్పు! - అహ్మద్​ ఒమర్​ సయ్యద్​ షేక్​

ప్రముఖ మీడియా సంస్థ వాల్​ స్ట్రీట్​ జర్నల్​కు చెందిన అమెరికా జర్నలిస్ట్​ డానియేల్​ పెరల్​ అపహరణ, హత్య కేసుల్లో నిందితుడిని విడుదల చేయాలని పాకిస్థాన్​ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గతంలో సింధ్​ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తూ.. ట్రయిల్​ కోర్టు విధించిన మరణశిక్షను కొట్టి వేసింది.

Pak SC orders release of Daniel Pearl murder accused
జర్నలిస్టు హత్యకేసులో పాక్ సుప్రీంకోర్టు​ కీలక నిర్ణయం

By

Published : Jan 28, 2021, 6:02 PM IST

అమెరికన్​ జర్నలిస్ట్​ డానియేల్​ పెరల్​ అపహరణ, హత్య కేసుల్లో నిందితునిగా ఉన్న అహ్మద్​ ఒమర్​ సయ్యద్​ షేక్​ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పాకిస్థాన్​ సుప్రీంకోర్టు ఆదేశించింది. సయ్యద్​ని ముద్దాయిగా తేలుస్తూ.. సింధ్​లోని ట్రయిల్ కోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది. అనంతరం సింధ్​ హైకోర్టు మరణ శిక్షను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పుని సవాలు చేస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుకు మద్దతు పలికింది. సయ్యద్​ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ది వాల్ స్ట్రీట్ జర్నల్​కు చెందిన డానియేల్​ పెరల్​ 2002లో కరాచీలో మత ఉగ్రవాదంపై పరిశోధన చేపట్టాడు. అదే సమయంలో ఆయన అపహరణకు గురైయ్యారు. నేల రోజుల తరువాత పెరల్​ తలను తొలగిస్తున్న వీడియో అమెరికా కాన్సూలెట్​కి పంపించారు. ఈ కేసులో సయ్యద్​కు 2002లో మరణశిక్షను ఖరారు చేస్తూ ట్రయిల్​ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసును పరిశీలించిన తరువాత సింధ్​ హైకోర్టు ట్రయిల్​ కోర్టు తీర్పుని కొట్టివేసింది.

మరోవైపు.. కరాచీలోని తీవ్రవాద నిరోధక కోర్టు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో సయ్యద్​ సహా మరో ముగ్గురికి మరణశిక్ష విధించింది.

ఇదీ చూడండి: కరోనాపై దేశాల స్పందనకు.. అవినీతికి లింకు అదెలా?

ABOUT THE AUTHOR

...view details