తెలంగాణ

telangana

ETV Bharat / international

కుల్‌భూషణ్‌ జాదవ్​కు నేడు దౌత్యసాయం - కుల్‌భూషణ్‌ జాదవ్​

పాకిస్థాన్​ చెరలో బందీగా ఉన్న కుల్​భూషణ్​ జాదవ్​కు నేడు రాయబార అనుమతి కల్పిస్తామని దాయాది దేశం​ ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు, వియన్నా ఒప్పందం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

కుల్‌భూషణ్‌ జాదవ్​కు నేడు దౌత్యసాయం

By

Published : Sep 2, 2019, 5:11 AM IST

Updated : Sep 29, 2019, 3:25 AM IST

కుల్‌భూషణ్‌ జాదవ్​కు నేడు దౌత్యసాయం

భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు రాయబార అనుమతి కల్పించేందుకు పాకిస్థాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. దౌత్యసాయం అందించేందుకు నేడు అవకాశం కల్పిస్తామని పాక్‌ విదేశాంగ శాఖ ట్వీట్​ చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలు, రాయబార సంబంధాలపై వియన్నా ఒప్పందం ప్రకారం.. కుల్‌భూషణ్‌కు కాన్సులర్‌ అనుమతి జారీ చేశామని పాక్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

పాక్​ విదేశాంగ శాఖ ట్వీట్​

తక్షణ రాయబార అనుమతి కల్పించాలన్న ఐసీజే తీర్పు మేరకు గతంలో భారత అధికారులు జాదవ్​తో సమావేశం అవ్వాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం ఆరు వారాల తర్వాత జాదవ్​కు రాయబార అనుమతి కల్పించనుంది పాకిస్థాన్​.

గూఢచర్యం ఆరోపణలతో 2017లో కుల్‌భూషణ్‌ను అరెస్టు చేసింది పాక్​ సైన్యం. మరణ శిక్షనూ విధించింది. దీనిపై భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇదీ చూడండి: మాల్దీవులు వేదికగా భారత్​-పాక్​ మాటలయుద్ధం

Last Updated : Sep 29, 2019, 3:25 AM IST

ABOUT THE AUTHOR

...view details