పాకిస్థాన్ సరికొత్త యుద్ధ విమానాలను తయారు చేసింది. రెండు సీట్లు ఉండే జేఎఫ్-17ను రూపొందించింది. తన మిత్ర దేశం చైనా సహకారంతో ఐదు నెలల్లోనే వీటిని ఉత్పత్తి చేసింది
ఈ సందర్భంగా ఇస్లామాబాద్ సమీపంలోని కమ్రా విమానాల తయారీ కర్మాగారంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పాకిస్థాన్ వైమానిక దళం తెలిపింది.రెండు సీట్లు కలిగిన 8 జేఎఫ్ -17 విమానాలను తయారు చేసినట్లు పాక్ ఎయిర్ చీఫ్ ముజాహిద్ అన్వర్ ఖాన్ తెలిపారు.