జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కేంద్ర హోంశాఖ విడుదల చేసిన సంపూర్ణ భారత చిత్రపటాన్ని తప్పుబట్టింది పొరుగు దేశం పాకిస్థాన్. ఈ మ్యాప్ పూర్తిగా తప్పని, చట్టబద్ధంగా ఆమోదించలేమని తెలిపింది.
కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన జమ్ము-కశ్మీర్, లద్ధాఖ్‌లతో కూడిన భారత నూతన చిత్రపటాన్ని కేంద్రం విడుదుల చేసింది. ఇందులో జమ్ము-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భాగంగా ఉంది. లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో కార్గిల్, లేహ్ జిల్లాలతో పాటు గిల్గిత్-బాల్టిస్థాన్ అంతర్భాగమైంది. అవిభక్త రాష్ట్రంలోని మిగతా ప్రాంతమంతా జమ్ము-కశ్మీర్లో భాగంగా ఉంటుందని ప్రభుత్వం వివరించింది.