తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ పేరు చెప్పగానే పాక్‌ మంత్రికి విద్యుదాఘాతం - పాకిస్థాన్​ రైల్వే మంత్రి

కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తుండగా పాకిస్థాన్​ రైల్వే మంత్రి షేక్​ రషీద్​ అహ్మద్​ విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో వైరల్​గా మారాయి.

మోదీ పేరు చెప్పగానే పాక్‌ మంత్రికి విద్యుదాఘాతం

By

Published : Aug 31, 2019, 5:06 AM IST

Updated : Sep 28, 2019, 10:45 PM IST

పాకిస్థాన్​ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌కు విచిత్ర ఘటన ఎదురయింది. ఇస్లామాబాద్‌లో నిర్వహిస్తున్న కశ్మీర్​ అవర్​ సభలో మాట్లాడుతున్న సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు అహ్మద్​.

కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశాలేమిటో మాకు తెలుసంటూ వ్యాఖ్యానిస్తుండగా ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. షాక్‌ కొట్టిన క్షణంలో ఆయన ఒక్కసారిగా వేదికపై తుళ్లిపడ్డారు. అనంతరం ఈ సమావేశాన్ని మోదీ విఫలం చేయలేరంటూ రషీద్‌ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ వ్యవహారంలో రషీద్‌ ఇటీవల అనవసరంగా నోరు పారేసుకున్నారు. కశ్మీర్‌ అంశంపై పోరాటానికి నిర్ణయాత్మక సమయం వచ్చేసిందన్నారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో భారత్‌- పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరుగుతుందంటూ రావల్పిండిలో జోస్యం చెప్పారు. రెండు దేశాల మధ్య ఇది చివరి యుద్ధం కానుందని నోటి దురుసు ప్రదర్శించారు.

ఇదీ చూడండి: కశ్మీర్ అంశంపై పాక్ రగడ-అరగంట పాటు ఆందోళన

Last Updated : Sep 28, 2019, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details