పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీఎంఎల్-నవాజ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం సహా మరికొంతమంది నేతలపై దేశ ద్రోహం కేసు నమోదైంది. దీంతోపాటు సైబర్ ఉగ్రవాదం, నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించటం తదితర కఠినమైన అభియోగాలను మోపారు.
పాక్ మాజీ ప్రధానిపై దేశ ద్రోహం కేసు - పాకిస్థాన్ న్యూస్
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఆయన ఇటీవల వీడియో ద్వారా చేసిన రెండు ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు లాహోర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పాక్ మాజీ ప్రధానిపై దేశ ద్రోహం కేసు
లండన్‌లో ఉన్న షరీఫ్ ఇటీవల వీడియో ద్వారా చేసిన రెండు ప్రసంగాలపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు లాహోర్ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాక్ సైన్యం, న్యాయ వ్యవస్థలపై ప్రజల తిరుగుబాటును ప్రోత్సహించేలా ఆ ప్రసంగాలు ఉన్నాయని అభియోగాల్లో పేర్కొన్నారు.