పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. బుధవారం జరిగిన సెనెట్ ఎన్నికల్లో తన సన్నిహితుడు, ఆర్థికమంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి పాలయ్యారు. హఫీజ్ కోసం ఇమ్రాన్ ప్రచారం సైతం నిర్వహించారు. మంత్రిపై విపక్షాల తరఫున పోటీ చేసిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి గిలాని విజయం సాధించారు.
విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న పాక్ ప్రధాని - పాకిస్థాన్‌లో విశ్వాస పరీక్ష
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. తన సన్నిహితుడు అబ్దుల్ హాఫీజ్ సెనెట్ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల... అభ్యర్థి తరఫున ప్రచారం చేసినందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి.
విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న ఇమ్రాన్
ఇమ్రాన్ ఖాన్ సెనెట్ విశ్వాసాన్ని కోల్పోయారని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు పట్టపట్టాయి. దీంతో పార్లమెంటులో బలం నిరూపించుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని యోచిస్తున్నారు.
ఇదీ చూడండి: చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి సిద్ధం: ఇమ్రాన్