పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. గత వారం ఇమ్రాన్‌ను కలిసిన ఈదీ సేవా సంస్థ అధిపతి కుమారుడికి తాజాగా కరోనా నిర్ధరణ అయిన నేపథ్యంలో ప్రధానికి పరీక్షలు చేసినట్లు వివరించారు.
ప్రధానమంత్రికి కరోనా నిర్ధరణ పరీక్షలు
గత వారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసిన వ్యక్తికి కరోనా సోకిన నేపథ్యంలో ఆ దేశ యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం ప్రధానికి వైరస్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
ప్రధానమంత్రికి కరోనా నిర్ధరణ పరీక్షలు
పాకిస్థాన్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణ కోసం తన వంతు సాయం అందించటం కోసం ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడి కుమారుడు ఫైజల్ ఏప్రిల్ 15న ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కోటి రూపాయల చెక్కును ప్రధానికి అందించారు. తాజాగా ఫైజల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.
పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 9,749 మందికి వైరస్ సోకగా.. 209 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.