అఫ్గానిస్థాన్‌లో సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లతో(Afghanistan Taliban) చర్చించినట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan on Taliban) తెలిపారు. అందులో తజిక్‌లు, హజారాలు, ఉజ్బెక్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. కొత్త సర్కారులో అన్ని జాతి, మత, రాజకీయ వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)(SCO on Afghanistan) సభ్య దేశాలు నొక్కి చెప్పిన అనంతరం ఈ మేరకు చర్చలు జరిపారు ఇమ్రాన్.
ఆగస్టు మధ్యలో అఫ్గాన్‌ను అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా సమ్మిళిత ప్రభుత్వాన్ని(Afghan government formation) ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 33 మంది సభ్యులున్న తాత్కాలిక కేబినెట్లో ఒక్క హజారా సభ్యుడు గానీ, మహిళ గానీ లేరు. అయితే 20 సంవత్సరాల సంఘర్షణ తర్వాత అఫ్గాన్‌లో శాంతి, సుస్థిరతలు నెలకొనబోతున్నాయని ఇమ్రాన్ ట్వీట్(Imran Khan twitter) చేశారు.
'బైడెన్‌ను అన్యాయంగా విమర్శిస్తున్నారు'