భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన ఆరోగ్యం బాగుండాలని ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ కూడా ఇటీవలే కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.
మన్మోహన్ కోలుకోవాలని పాక్ ప్రధాని ఆకాంక్ష - ఇమ్రాన్ ఖాన్ ట్వీట్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా నిర్ధరణ అయిన క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు.
మన్మోహన్ సింగ్ కోలుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్
మన్మోహన్ సింగ్‌కు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి:నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం- ప్రముఖుల ఆరా