తెలంగాణ

telangana

ETV Bharat / international

'నవాజ్​ను తిరిగి రప్పించే ప్లాన్ వేయండి!' - nawaz Sharif case

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను బ్రిటన్ నుంచి తిరిగి తీసుకురావడానికి చట్టపరమైన వ్యూహాన్ని సిద్ధం చేయాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Pak PM imran Khan asks party leaders for legal strategy to bring back nawaz Sharif from UK
'నవాజ్ ను తిరిగి రప్పించే ప్లాన్ వేయండి!'

By

Published : Oct 3, 2020, 3:55 PM IST

చికిత్స పేరిట లండన్ వెళ్లిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తిరిగి పాకిస్థాన్​కు రప్పించడానికి చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలని తమ పార్టీ నేతలకు సూచించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకతాటిపైకి వచ్చిన ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు ఖాన్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్న ప్రతిపక్షాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

పనామా పత్రాల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) నాయకుడు నవాజ్ షరీఫ్ చికిత్స పేరిట బెయిల్​పై లండన్​ వెళ్లారు. నవాజ్​ను తిరిగి పాక్​కు అప్పగించాలని గతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అభ్యర్థన లేఖ పంపింది పాక్. అయితే, ఇరు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం లేనప్పుడు షరీఫ్​ను రప్పించడం కష్టమంటున్నారు విశ్లేషకులు.

ఇదీ చదవండి: 'పరారీ'లో షరీఫ్- బ్రిటన్​ను ఆశ్రయించిన పాక్​

ABOUT THE AUTHOR

...view details