కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్పై జరిగిన దాడివెనక భారత్ హస్తం ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సందేహం లేదని పాక్ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించారు.
"ముంబయిలో జరిగినట్టుగానే కరాచీలో కూడా చేయాలనుకున్నారు. పాక్‌లో అనిశ్చితి నెలకొల్పాలని వారు(భారత్) అనుకున్నారు. ఇది కచ్చితంగా భారత్ చేసిన పనే. ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు. స్టాక్ ఎక్స్చేంజ్లోని వారిని బందీలుగా తీసుకుని.. భయం, అనిశ్చితిని నెలకొల్పేందుకు వారిని చంపాలని ఉగ్రవాదులు భావించారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఆయుధాలు తీసుకొచ్చారు. కానీ ఉగ్రవాదులను పాక్ భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి."
- ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధాని.