తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో తబ్లీగీ ప్రకంపనలు.. 41 మందికి కరోనా

భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లోనూ తబ్లీగీ జమాత్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ నిర్వహించిన రాయ్‌విండ్‌ మర్కజ్‌లో పాల్గొన్న వారిలో 41 మందికి కరోనా సోకడం స్థానికులను కలవరపెడుతోంది. పాక్​లో మొత్తంగా 2 వేల 200 మందికిపైగా కరోనా సోకగా.. ఇప్పటివరకు 31 మంది మృత్యువాతపడ్డారు.

By

Published : Apr 2, 2020, 8:10 PM IST

Pak places Raiwind under complete lockdown after Tablighi Jamaat
పాక్​లో తబ్లీగీ ప్రకంపనలు.. 41 మందికి కరోనా

దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన మర్కజ్​ ఘటన దేశంలో కలకలం సృష్టించింది. ఆ ప్రార్థనల్లో పాల్గొన్నవారికి ప్రతి రాష్ట్రంతోనూ ఏదో విధంగా సంబంధం ఉండటం కారణంగా.. కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే.. పాకిస్థాన్​లోనూ తబ్లీగీ జమాత్​ ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ నిర్వహించిన రాయ్​విండ్​ మర్కజ్​లో పాల్గొన్నవారిలో 40మందికిపైగా వైరస్​ సోకింది.

దీంతో వైరస్‌ మరింత వ్యాపించకుండా ఆ నగరాన్ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు. ఔషధ దుకాణాలు సహా అన్నీ మూసివేశారు. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు.

సభ్యులు అరెస్టు...

ఐదుగురు నైజీరియన్లు సహా 50 మంది వైరస్‌ వ్యాప్తికి కారణమని పాక్‌ అధికార వర్గాలు భావిస్తున్నాయి. వారందరినీ లాహోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని కసూర్‌లో క్వారంటైన్‌ చేశారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో తబ్లీగీలో పాల్గొన్న వారివల్ల 38 మందికి వైరస్‌ సోకిందని వారు అంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు రాయ్‌విండ్‌ మర్కజ్‌, మసీదుల్లోని జమాత్‌ సభ్యులను సింధ్‌, పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రజలు గుమిగూడొద్దని సూచించినా తబ్లిగీ జమాత్‌ అవేమీ పట్టించుకోకుండా వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించింది. వేల మంది హాజరుకావడంతో తబ్లీగీని వాయిదా వేయాలని అధికారులు కోరినప్పటికీ పట్టించుకోలేదని లాహోర్‌ డిప్యూటీ కమిషనర్‌ డానిష్‌ అఫ్జల్‌ అన్నారు.

ఇప్పటికీ 600 మంది రాయ్‌విండ్‌ మర్కజ్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. 110 మంది నమూనాలు పరీక్షలకు పంపించగా 41 మందికి కొవిడ్‌-19 సోకిందని ఆయన తెలిపారు. తబ్లీగీ సమస్య భారత్‌, పాకిస్థాన్‌కు మాత్రమే కాకుండా మలేసియా, బ్రూనైలోనూ కరోనా కేంద్రంగా మారింది.

పాకిస్థాన్​లో ఇప్పటివరకు 2 వేల 2 వందల మందికిపైగా కరోనా సోకగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details