తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్​'పై మారని పాక్​ తీరు.. పార్లమెంటు​లో తీర్మానం - kashmir latest news

అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్​ విభజనపై పాకిస్థాన్​ తీరు మారటం లేదు. కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. ఆ దేశ పార్లమెంటు​లో తీర్మానం చేసింది. కశ్మీర్​లో పర్యటించేందుకు అంతర్జాతీయ సంస్థలకు అనుమతులు ఇవ్వాలని, అక్కడ సాధారణ పరిస్థితులు కల్పించాలని పేర్కొంది.

Pak parliament passes resolution
'కశ్మీర్​'పై మారని పాక్​ తీరు.. పార్లమెంట్​లో తీర్మానం

By

Published : Feb 5, 2020, 5:20 AM IST

Updated : Feb 29, 2020, 5:41 AM IST

'కశ్మీర్​'పై మారని పాక్​ తీరు.. పార్లమెంట్​లో తీర్మానం

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసి ఆరు నెలలు గడిచినా.. పాకిస్థాన్​ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. కశ్మీర్​ ప్రజలకు మద్దతు తెలుపుతూ.. ఆ దేశ పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదాను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని భారత్​ వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేసింది.

ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్​ సంఘీభావ రోజు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పాక్​ పార్లమెంటు​ దిగువ సభలో తీర్మానం ఆమోదించింది. గత ఏడాది ఆగస్టు 5, అక్టోబర్​ 31న తీసుకున్న నిర్ణయాలను, తీసుకొచ్చిన చట్టాలని వెనక్కి తీసుకోవాలని, కశ్మీర్​లోని బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేసింది. కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు కల్పించాలని కోరినట్లు ఆ దేశ అధికారిక రేడియో పేర్కొంది.

అదే మాటా..

కశ్మీరీ ప్రజలకు పాకిస్థాన్​ రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతు ప్రకటిస్తున్నట్లు తీర్మానం ద్వారా పునరుద్ఘాటించింది. తన తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్​ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరింది. కశ్మీర్​లో పర్యటించేందుకు అంతర్జాతీయ సంస్థలు, పార్లమెంటేరియన్లు, మీడియాను అనుమతించాలని డిమాండ్​ చేసింది. దాని వల్ల కశ్మీర్​లోని మానవ హక్కుల పరిస్థితి ప్రపంచానికి తెలుస్తుందని పేర్కొంది.

ప్రత్యేక సమావేశం..

కశ్మీర్​ సమస్యను పరిష్కరించేందుకు ముస్లిం దేశాల ఆధ్వర్యంలోని ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​ ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.

కేంద్రంపై విమర్శలు..

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది పాక్​. భాజపా నేతలు యుద్ధం రావాలని కోరుకుంటున్నారని.. అలాంటి వ్యాఖ్యలను తాము తిరస్కరిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొంది. అది ప్రాంతీయ శాంతి, సమగ్రతపై ప్రభావం చూపుతుందని తెలిపింది. భారత్​ తీసుకోబోయే ఎలాంటి నిర్ణయాన్నైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్​ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: మనిషి మెదడులో నాలుగు అంగుళాల '​ఏలికపాము'

Last Updated : Feb 29, 2020, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details