తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2022, 4:52 PM IST

ETV Bharat / international

క్షిపణి ప్రయోగంలో పొరపాటుపై పాకిస్థాన్​ అసంతృప్తి

India missile hit Pakistan: క్షిపణి ప్రయోగంలో జరిగిన పొరపాటుపై పాకిస్థాన్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన క్షిపణి ప్రయోగం నిర్వహించగల శక్తి సామార్థ్యాలు భారత్​కు లేవా? అని ప్రశ్నించారు ఆ దేశా జాతీయ భద్రతా సలహాదారు యూసుఫ్.

Pak NSA questions
'ఆ సామార్థ్యాలు భారత్​కు లేవా?'

India missile hit Pakistan: భారత క్షిపణి పొరపాటున పాకిస్థాన్​లో పడడంపై ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ స్పందించారు. ఈ ఘటనపై భారత్ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. క్షిపణి ప్రయోగం లాంటి అత్యంత సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్వహించగల శక్తి సామార్థ్యాలు భారత్​కు లేవా అని ప్రశ్నించారు.

రెండు రోజుల క్రితం భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడినట్లు రక్షణశాఖ వెల్లడించింది. మార్చి 9న జరిగిన క్షిపణి ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తి ఈ పొరపాటు జరిగినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదన్న రక్షణశాఖ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.

అయితే ఈ ఘటన గురించి పాక్​ కు తెలియజేయడంపై భారత్​ అలసత్వం వహించిందని మొయీద్​ యూసఫ్​ అన్నారు. ఇటువంటి సున్నితమైన సాంకేతికతను పరీక్షించే అంశంలో భారతదేశ సామర్థ్యంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ క్షిపణి అంతర్జాతీయ, దేశీయ విమానయాన మార్గానికి చేరువగా ప్రయాణించి పౌరుల భద్రతకు ముప్పు తెచ్చిందని అన్నారు. క్రూయిజ్ క్షిపణిని అనుకోకుండా ప్రయోగించిందన్న దానిపై భారత అధికారులు ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:పాక్​ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి.. అసలేమైంది?

ABOUT THE AUTHOR

...view details