తెలంగాణ

telangana

ETV Bharat / international

18 ఏళ్లు దాటితే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే! - పాకిస్థాన్​లో పెళ్లి చట్టం

18 ఏళ్ల వయసు దాటిన వారికి వివాహాన్ని తప్పనిసరి చేసేలా.. పాకిస్థాన్​ సింధ్(Sindh)​ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు(lawmaker) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే సామాజిక రుగ్మతలు, చిన్నారులపై అత్యాచారాలు, నేరాలు వంటివి తగ్గుతాయని పేర్కొన్నారు.

wedding, marriage
పెళ్లి, వివాహం, కల్యాణం, మ్యారేజీ, వెడ్డింగ్​

By

Published : May 27, 2021, 10:53 AM IST

పాకిస్థాన్​ సింధ్​ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు(Pakistani lawmaker) వినూత్న బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. 18 ఏళ్లు నిండిన వారికి వివాహాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బిల్లు ముసాయిదాను అసెంబ్లీలో సమర్పించారు. సమాజంలో అనైతిక కార్యకలాపాలను నిరోధించటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నామని సదరు నేత తెలిపారు.

ఈ మేరకు 'ద సింధ్​ కంపల్సరీ మ్యారేజ్​ యాక్ట్​-2021(The Sindh Compulsory Marriage Act, 2021)' బిల్లు ముసాయిదాను.. సింధ్​ అసెంబ్లీ సెక్రటేరియట్​కు మత్తాహిదా మజ్లిస్​​-ఏ-అమల్​(ఎమ్​ఎమ్​ఏ) పార్టీకి చెందిన నేత సయ్యద్​ అబ్దుల్​ రషీద్ అందజేశారు. 18 ఏళ్లు దాటినవారికి వివాహం చేయని తల్లిందండ్రులు అందుకు గల కారణాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్​ ఎదుట తెలియజేయాలని మసాయిదాలో పేర్కొన్నారు. అలా చేయని వారికి రూ.500ను జరిమానా విధించాలని తెలిపారు. ఈ బిల్లు ముసాయిదాను సమర్పించిన అనంతరం.. అబ్దుల్ రషీద్​ ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు.

"సామాజిక రుగ్మతలు, పిల్లలపై అత్యాచారాలు, అనైతిక కార్యకలాపాలు, నేరాలు వంటివి దేశంలో పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి ముస్లిం(muslim) యువతీ యువకులుకు 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునే హక్కును కల్పిస్తున్నాం. వారి తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.''

- సయ్యద్​ అబ్దుల్​ రషీద్​ , ఎమ్​ఎమ్​ఏ నేత

ఈ బిల్లు చట్టరూపంలోకి మారితే.. సింధ్​ రాష్ట్ర యువత పురోగతి చెందుతుందని అబ్దుల్ రషీద్​ చెప్పారు. ఇందుకోసం అసెంబ్లీలోని సభ్యులంతా మద్దతు తెలపాలని కోరారు.

ఇదీ చూడండి:ప్రాంతీయ సవాళ్లపై మోదీ, మేక్రాన్​ చర్చ

ఇదీ చూడండి:Vijay Mallya: విజయ్​ మాల్యాకు కోర్టులో మళ్లీ మొండిచెయ్యి

ABOUT THE AUTHOR

...view details