పాకిస్థాన్ బలూచిస్తాన్ రాష్ట్రంలో ఓ మహిళా పోలీస్ అధికారి(pakistan lady police) విచక్షణా రహితంగా ప్రవర్తించింది. జైలులోని మహిళా ఖైదీని(Women prisoners) బలవంతంగా బట్టలు విప్పించింది. ఆ తర్వాత ఆమెను అందరిముందు నగ్నంగా నృత్యం చేయించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన దర్యాప్తు కమిటీ.. ఇన్స్పెక్టర్ శభానా ఇర్షద్ అధికార దుర్వినియోగానికి పాల్పడి అమానవీయంగా ప్రవర్తించినట్లు తేల్చింది. దీంతో ఆమెను విధుల నుంచి తొలగించారు పై అధికారులు.
క్వెట్టాలోని జిన్నా టౌన్షిప్లో ఓ చిన్నారి హత్య కేసుకు సంబంధించి పారీ గుల్ అనే మహిళను విచారణ నిమిత్తం శభానా అరెస్టు చేసింది. పోలీస్ రిమాండ్లో ఉన్న ఆ మహిళను బట్టలు విప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత జైలులో అందరిముందు నగ్నంగా నృత్యం చేయించింది. విషయం తెలుసుకున్న పైఅధికారులు సదరు మహిళా పోలీస్ అధికారిపై వేటు వేశారు. ఈ వికృత చేష్టలు రుజువు కావడం వల్ల ఆమె ఏమీ మాట్లడలేదని పేర్కొన్నారు.