తెలంగాణ

telangana

ETV Bharat / international

Afghan Taliban: 'తాలిబన్ల పాలనతోనే అఫ్గాన్​లో శాంతి భద్రతలు' - తాలిబన్లపై పాకిస్థాన్

తాలిబన్లలో పాలనలో (Afghan Taliban) అఫ్గానిస్థాన్​లో శాంతి, భద్రతలు నెలకొంటాయని ఆశిస్తున్నామని పాకిస్థాన్​ పేర్కొంది. అఫ్గాన్​లో శాంతి నెలకొల్పేందుకు తమ వంతు కూడా కృషి చేస్తున్నామని తెలిపింది.

taliban rule
తాలిబన్ల పాలనలో శాంతి భద్రతలు!

By

Published : Sep 11, 2021, 5:26 AM IST

Updated : Sep 11, 2021, 6:43 AM IST

అఫ్గానిస్థాన్​పై తాలిబన్ల దురాక్రమణను సమర్థిస్తూ వచ్చిన పాకిస్థాన్​.. తాజాగా వారి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం.. అఫ్గానిస్థాన్​లో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పుతుందని (Afghan Taliban) ఆశిస్తున్నామని పాక్​ పేర్కొంది. అఫ్గాన్​ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాలిబన్లు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అఫ్గాన్​ ప్రజలకు సాయం అందించి వారి అవసరాలు తీర్చడంలో అంతర్జాతీయ సమాజం కూడా కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నామని పేర్కొంది.

అఫ్గానిస్థాన్​లో శాంతిని నెలకొల్పేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పాక్​ చెప్పుకొచ్చింది. ఇందు కోసం ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ 13 మంది ప్రపంచ నేతలను సంప్రదించారని తెలిపింది. 'అఫ్గాన్​ అభివృద్ధి కోసం పలు దేశాలు తమ వంతు సాయం అందిస్తుంటే.. కొందరు మాత్రం అక్కడి పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు' అని పాకిస్థాన్​ విదేశాంగ ప్రతినిధి అసీమ్​ అహ్మద్​ వ్యాఖ్యానించారు. అయితే.. అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం కానీ సమాచారం కానీ అందలేదన్నారు.

ఇదీ చూడండి :అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడిని చంపిన తాలిబన్లు!

Last Updated : Sep 11, 2021, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details