తెలంగాణ

telangana

ETV Bharat / international

కర్తార్​పుర్ కారిడార్ పునఃప్రారంభానికి పాకిస్థాన్ రెడీ - కర్తార్​పుర్ పాకిస్థాన్

కరోనా కారణంగా మూతపడిన కర్తార్​పుర్​ కారిడార్​ను పునఃప్రారంభించడానికి పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం నుంచి రహదారిని తిరిగి తెరవడానికి సిద్ధమని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది. దీనికోసం అవసరమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు భారత్​ను ఆహ్వానించింది.

pak-has-conveyed-its-readiness-to-india-to-reopen-kartarpur-corridor-from-monday-fo
కర్తార్​పుర్ కారిడార్ పునఃప్రారంభానికి పాకిస్థాన్ రెడీ

By

Published : Jun 27, 2020, 3:24 PM IST

Updated : Jun 27, 2020, 5:26 PM IST

సిక్కు గురువు మహారాజా రంజీత్ సింగ్ వర్ధంతి నేపథ్యంలో సోమవారం నుంచి కర్తార్​పుర్ కారిడార్​ పునఃప్రారంభించేందుకు సిద్ధమని పాకిస్థాన్.. భారత్​కు తెలియజేసింది. కరోనా మహమ్మారి వల్ల మూడు నెలల క్రితం తాత్కాలికంగా మూతపడిన ఈ రహదారిని తిరిగి ప్రారంభించనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

''ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, మత ప్రదేశాలు క్రమంగా తెరుచుకుంటున్న క్రమంలో పాకిస్థాన్ సైతం కర్తార్​పుర్ ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టింది. వైద్య మార్గదర్శకాలను అనుసరించి కర్తార్​పుర్ తిరిగి ప్రారంభించడానికి కావాల్సిన ఎస్​ఓపీల(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)ను తయారు చేయడానికి భారత్​ను పాకిస్థాన్ ఆహ్వానించింది.''

-పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కర్తార్​పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి అవసరమైన రిజిస్ట్రేషన్లను మార్చి 16న భారత్ నిలిపివేసింది.

భక్తుల కోసం..

సిక్కుల సందర్శనార్థం పాకిస్థాన్​లోని కర్తార్​పుర్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ వరకు కారిడార్​ను ఇరుదేశాలు కలిసి నిర్మించాయి. గతేడాది నవంబర్​లో ఈ కారిడార్​ను ప్రారంభించాయి. పాక్​లోని నరోవాల్ జిల్లా రావి నది సమీపంలో కర్తార్​పుర్ సాహిబ్ గురుద్వారా ఉంది. డేరాబాబా నానక్ నుంచి ఈ ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తన జీవిత చరమాంకాన్ని కర్తార్​పుర్​లోనే గడిపినట్లు భక్తులు విశ్వసిస్తారు. 18 ఏళ్ల పాటు గురునానక్ ఈ ప్రాంతంలో జీవించారు. భారత్​లోని అన్ని మతాల ప్రజలకు ఈ చారిత్రక గురుద్వారాను సందర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది.

ఇదీ చదవండి-టాయిలెట్ డిజైన్ చెప్పండి​.. రూ.15 లక్షలు గెలుచుకోండి!

Last Updated : Jun 27, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details