తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇస్లామిస్టుల​ డిమాండ్లకు తలొగ్గిన ఇమ్రాన్​!

ఉగ్రవాద భావజాల ఇస్లామిస్టులు కోరినట్లే ఫ్రాన్స్​ రాయబారిని బహిష్కరిస్తూ తమ దేశ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ అంగీకరించారు. ఫ్రెంచ్​ పత్రిక దైవదూషణ కార్టూన్లు వేసినందుకు.. ఆ దేశ రాయబారిని బహిష్కరించడం వల్ల ప్రయోజనం లేదని సోమవారం వ్యాఖ్యానించిన ఆయన మాట మార్చారు.

imran khan
ఇమ్రాన్​ఖాన్

By

Published : Apr 21, 2021, 7:59 AM IST

ఉగ్రవాద భావజాల ఇస్లామిస్టుల డిమాండ్లకు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్​ తలొగ్గారు. ఫ్రెంచ్​ పత్రిక దైవదూషణ కార్టూన్లు వేసినందుకు.. ఆ దేశ రాయబారిని బహిష్కరించడం వల్ల ప్రయోజనం లేదని సోమవారం వ్యాఖ్యానించిన ఆయన మాట మార్చారు. ఇస్లామిస్టులు కోరినట్లే ఫ్రాన్స్​ రాయబారిని బహిష్కరిస్తూ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించారు.

తీవ్రవాద భావాలున్న 'ఇస్లామిస్ట్​ పార్టీ తెహ్రీక్​-ఎ-లబ్బాయిక్​ పాకిస్థాన్​(టీఎల్పీ)' పై నమోదైన ఉగ్రవాద ఆరోపణల కేసులన్నింటినీ ఎత్తివేసేందుకూ ఇమ్రాన్​ తలూపారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార పాకిస్థాన్​ 'తెహ్రీక్​-ఎ-ఇన్సాఫ్​ పార్టీ సభ్యుడు అమ్​జద్​ అలీఖాన్​ మంగళవారం హడావుడిగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నిజానికి ఇది ప్రైవేటు తీర్మానం. అయినా.. దీనిపై వెంటనే చర్చ చేపట్టేందుకు స్పీకర్​ అసద్​ ఖైసర్​ అంగీకరించారు. గత ఏడాది సెప్టెంబరులో ఫ్రెంచ్​ పత్రిక ఛార్లీహెబ్డో దైవదూషణతో కూడిన వ్యంగ్య చిత్రాలను ప్రచురించడాన్ని ఈ తీర్మానం ఖండించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details