తెలంగాణ

telangana

ETV Bharat / international

కర్తార్​పుర్ నడవాను మళ్లీ తెరిచిన పాక్​ - kartarpur corridor reopened after covid eased

కరోనా కారణంగా మూతపడిన కర్తార్​పుర్ సాహిబ్ కారిడార్​ను పాకిస్థాన్ పునఃప్రారంభించింది. ఒప్పందం ప్రకారం... భారత్​ నుంచి వచ్చే భక్తులను ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతించనున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Pak govt reopens Kartarpur Corridor as coronavirus situation improves
కర్తార్​పుర్ నడవాను పునఃప్రారంభించిన పాక్

By

Published : Oct 3, 2020, 8:38 PM IST

కర్తార్​పుర్ సాహిబ్ కారిడార్​ను పాకిస్థాన్ పునఃప్రారంభించింది. దేశంలో కరోనా పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరుదేశాలు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారత్​ నుంచి భక్తులకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

కరోనా ప్రబలిన నేపథ్యంలో మార్చిలో ఈ కారిడార్​ను భారత్ మూసివేసింది. అనంతరం పాక్ ప్రభుత్వం సైతం ఈ నడవా మీదుగా రాకపోకలపై నిషేధం విధించింది.

మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్ తాత్కాలికంగా ఈ కారిడార్​ను ప్రారంభించింది. అయితే భారత్​ మాత్రం తనవైపు ఉన్న రహదారిని తెరవలేదు.

4.7 కిలోమీటర్ల పొడవైన ఈ నడవా పాక్​లోని కర్తార్​పుర్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​లో ఉన్న డేరాబాబా నానక్ సాహిబ్​ను కలుపుతుంది. 2019లో దీని ప్రారంభోత్సవం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details