తెలంగాణ

telangana

ETV Bharat / international

జీతాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన - pakistan employees against imran khan govt

తమ జీతాలను 25 శాతం పెంచాలని డిమాండ్​ చేస్తూ పాకిస్థాన్​లోని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. పాక్​ జాతీయ అసెంబ్లీ మార్గాన్ని నిర్బంధించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. జూన్​ చివరినాటికి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

pak govt employees protest
పాకిస్థాన్​లో ప్రభుత్వ ఉద్యోగులు

By

Published : Jun 12, 2021, 11:00 AM IST

పాకిస్థాన్​లో ప్రభుత్వ ఉద్యోగస్థులు తమ జీతాలను 25శాతం పెంచాలని డిమాండ్​ చేస్తూ పెద్దఎత్తున నిరసన చేపట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 10శాతం పెంచుతామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను శుక్రవారం వారు వ్యతిరేకించారు. మూడేళ్లుగా తమ జీతాలను ప్రభుత్వం పెంచనేలేదని నిరసనకారులు మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. శుక్రవారం బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. పాకిస్థాన్​ జాతీయ అసెంబ్లీ బయట వారు ఆందోళన నిర్వహించారు.

పాక్​ జాతీయ అసెంబ్లీకి వెళ్లే రహదారి మార్గాన్ని నిరసనకారులు నిర్బంధించారు. 10శాతం ఫిట్​మెంట్​ పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్​ చేశారు. తమ జీతాలను 25శాతం పెంచకపోతే.. జూన్​ చివరినాటికి ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశం ముగిసిన అనంతరం పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ(పీపీపీ) ఛైర్మన్​ బిలాల్​వాల్​ భుట్టో జార్దారి నిరసనల్లోపాల్గొన్నారు. వారికి మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details