పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిర్వహణ ఖర్చులను వీలైనంతమేరకు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక వ్వవస్థను చక్కబెట్టేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఇప్పటికే 6 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. తన మిత్ర దేశాలైన చైనా, యూఏఈ సౌదీ నుంచి ప్యాకేజీని సైతం అందుకుంది.
అర్థిక వ్యవస్థ అంతంత్ర మాత్రంగానే ఉండగా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీతం రూ.2.01లక్షల నుంచి రూ.8లక్షల వరకు పెరిగినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు రావడం చర్చనీయాంశమైంది. అనంతరం ఆ వార్తలు నిరాధారమైనవని ఇమ్రాన్ కార్యాలయం స్పష్టం చేయగా చర్చకు తెరపడింది.