తెలంగాణ

telangana

ETV Bharat / international

'స్పైస్​ జెట్'​ను వెంబడించిన పాక్​ యుద్ధ విమానాలు.! - Pak fighter jets aboard SpiceJet

స్పైస్​ జెట్​ సంస్థకు చెందిన విమానాన్ని మిలిటరీ విమానంగా భావించి దాదాపు 2 గంటల పాటు వెంబడించాయి పాక్​ యుద్ధ విమానాలు. ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్పైస్​ జెట్​ విమానాన్ని వెంబడించిన పాక్​ యుద్ధ విమానాలు.!

By

Published : Oct 18, 2019, 6:36 AM IST

Updated : Oct 18, 2019, 7:31 AM IST

మిలిటరీ విమానం అనుకుని స్పైస్​ జెట్ సంస్థకు చెందిన ఓ సాధారణ​ విమానాన్ని... పాక్​కు చెందిన రెండు ఎఫ్​-16 యుద్ధవిమానాలు వెంబడించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 23న దిల్లీ నుంచి అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​కు 120 మంది ప్రయాణికులతో బయలు దేరింది స్పైస్​ జెట్​ విమానం.

రేడియో కమ్యూనికేషన్​ కోసం స్పైస్​ జెట్ విమానానికి కేటాయించిన సంకేతం విషయంలో గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో జెట్​ విమానాన్ని మిలిటరీ విమానంగా పాక్​ అధికారులు పొరబడ్డారు. తమ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే విమానాన్ని రెండు ఎఫ్​-16 యుద్ధ విమానాలతో వెంబడించారు.

ఇదీ చూడండి:అక్టోబర్​ 24 వరకు ఈడీ కస్టడీలో చిదంబరం

Last Updated : Oct 18, 2019, 7:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details