కశ్మీర్ అంశాన్ని అఫ్గానిస్థాన్‌లో శాంతి ప్రక్రియకు పాకిస్థాన్ ముడిపెట్టి మాట్లాడటంపై అఫ్గానిస్థాన్ మండిపడింది. ఈ మేరకు అమెరికాలోని అఫ్గానిస్థాన్ రాయబారి రోయా రహ్మాని ట్విట్టర్ ద్వారా లేఖను విడుదల చేశారు.
అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ ఆఫ్గాన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రహ్మానీ తెలిపారు. తమ దేశంపై పాక్ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు అఫ్గాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న మజీద్ ఖాన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.