తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ డ్రోన్​ కూల్చివేత - డ్రోన్

పాకిస్థాన్​ మరోసారి తన కుటిలత్వాన్ని ప్రదర్శించింది. పాక్​కు చెందిన ఓ మిలిటరీ డ్రోన్​ను సరిహద్దు వద్ద వాయసేన సుఖోయ్​ 30 ఎమ్​.కేఐ కూల్చేసింది.

పాక్​ డ్రోన్​ కూల్చివేత

By

Published : Mar 4, 2019, 11:23 PM IST

భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన దాయాది డ్రోన్‌ను సుఖోయ్‌ 30 ఎమ్​.కే.ఐ కూల్చేసింది. రాజస్థాన్‌లోని బికనీర్‌ సెక్టార్‌లోకి పాకిస్థాన్‌ డ్రోన్‌ ఒకటి ఉదయం 11.30 గంటలకు భారత్​లోకి ప్రవేశించటాన్ని వాయుసేన రాడార్లు పసిగట్టాయి. వెంటనే సైన్యాన్ని అప్రమత్తం చేశాయి.

భారత్​లోకి అక్రమంగా డ్రోన్​ను ప్రవేశపెట్టడం పాక్​కు ఇది రెండోసారి. ఫిబ్రవరి 27న భారత్​-పాక్ సరిహద్దు వద్ద గుజరాత్​ కుచ్​ జిల్లాలో ప్రవేశించబోయిన పాక్​ డ్రోన్​ను సైనికులు కూల్చేసారు.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాయుసేన అత్యంత అప్రమత్తంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details