తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ విమానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించం: పాక్​​ - undefined

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ మరోసారి అనుమతి నిరాకరించింది. జమ్ముకశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని వెల్లడించింది. సోమవారం మోదీ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా పాక్​ గగనతలాన్ని వినియోగించేందుకు భారత అధికారులు సరిహద్దు దేశం అనుమతి కోరారు.

మోదీ మినానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించం: పాక్​​

By

Published : Oct 27, 2019, 5:41 PM IST

Updated : Oct 27, 2019, 6:57 PM IST

ప్రధానిమోదీ విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు మరోమారు అనుమతి నిరాకరించింది పాకిస్థాన్​. జమ్ముకశ్మీర్​లో ఇటీవల ఆర్టికల్​ 370ని రద్దు చేసి.. ఆంక్షలు విధిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినందునే అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.

సోమవారం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా మోదీ విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు ఆ దేశ అనుమతి కోరగా.. పాక్​ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషీ అనుమతి నిరాకరించినట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని భారత హైకమిషన్​కు లిఖిత పూర్వకంగా అందజేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

గతంలోనూ నిరాకరణ

ఈ ఏడాది సెప్టెంబరులోనూ ప్రధాని మోదీ విమానానికి అనుమతి నిరాకరించింది పాక్​ ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ అమెరికా వెళ్లారు. అదే సమయంలో పాక్​ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఇమ్రాన్​ ప్రభుత్వం నిరాకరించింది. అదే నెలలోనే రాష్ట్రపతి రామ్​కోవింద్​ విమానానికి కూడా అనుమతిని నిరాకరిస్తున్నట్లు తెలిపింది.

బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలను భారత వాయుసేన నేలమట్టం చేసినప్పటి నుంచి.. భారత విమానాలు తమ గగనతలాన్ని వినియోగించకుండా మూసివేసింది పాక్​.

Last Updated : Oct 27, 2019, 6:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details