మృత్యువుతో పోరాడుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఎనిమిది వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది ఇస్లామాబాద్ ఉన్నత న్యాయస్థానం. రూ.20లక్షలు విలువ చేసే రెండు వేర్వేరు పూచీకత్తులపై షరీఫ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
షరీఫ్ ఆరోగ్యం పరిస్థితి మరింత విషమించింది. రక్తకణాల సంఖ్య అత్యంత ప్రమాదకరంగా 2 వేలకు పడిపోయినట్లు ఆయన వ్యక్తిగత వైద్యులు వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన్ను సర్వీసెస్ ఆసుపత్రిలో చేర్చారు. నవాజ్ షరీఫ్ గుండెపోటుతో పాటు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని వ్యక్తిగత డాక్టర్ అద్నాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.