తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్థాన్​ కోర్టు నోటీసులు - Pak court issues notice to Imran Khan in Shahbaz's defamation case

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు ఆ దేశంలోని ఓ కోర్టు నోటీసులు జారీచేసింది. గతంలో ఆయనపై నమోదైన పరువునష్టం దావా కేసులో ఈ మేరకు నోటీసులు అందుకున్నట్లు వెల్లడించారు అధికారులు.

Pak court issues notice to Imran Khan in Shahbaz's defamation case
ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్థాన్​ కోర్టు నోటీసులు

By

Published : Jun 6, 2020, 2:53 PM IST

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్​లోని ఓ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. 2017లో నమోదైన పరువు నష్టం దావా కేసులో ఆయన నోటీసులు అందుకున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ అధ్యక్షుడు షహ్‌బాజ్‌ షరీఫ్‌ ఈ కేసు పెట్టారు.

పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్‌పై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కోరినట్లు ఇమ్రాన్​ఖాన్​ తెలిపారు. ఈ మేరకు షహ్‌బాజ్‌ తనకు 61 మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపిన షహ్‌బాజ్‌ కోర్టును ఆశ్రయించారు.

60 సార్లు వాదనలు..

ఈ కేసులో ఇప్పటికే కోర్టు 60 సార్లు వాదనలు వినగా.. 33 సార్లు ఇమ్రాన్‌ వాయిదా కోరారు. మరికొన్ని సందర్భాల్లో తన లాయర్ల ద్వారా కోర్టుకు వాదనలు వినిపించిన పాక్​ ప్రధాని.. ఇప్పటివరకు స్వయంగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వలేదు. ఫలితంగా ఈసారి తప్పకుండా కోర్టుకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ సారి ఇక అంతే.?

ఇమ్రాన్‌ఖాన్‌ సమాధానమివ్వని పక్షంలో అధికరణ 62, 63 ప్రకారం ప్రధాని పదవికి అనర్హులవుతారని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'అప్పుడే అయిపోలేదు.. ఉగ్రరూపం ఇప్పుడే మొదలైంది'

ABOUT THE AUTHOR

...view details