వింగ్ కమాండర్ అభినందన్ అప్పగింతకు ముందు భారత్ ఎక్కడ దాడి చేస్తోందో అనే భయంతో పాకిస్థాన్ వణికిపోయిందన్న ఆ దేశ ప్రతిపక్షనేత అయాజ్ సాదిఖ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని యోచిస్తోంది అక్కడి ప్రభుత్వం. అయాజ్‌పై భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడం వల్ల ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎజాజ్ షా తెలిపారు.
2019 ఫిబ్రవరిలో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ.."ఆ రోజు జరిగిన సమావేశం నాకు బాగా గుర్తుంది. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.. పార్లమెంటరీ నేతలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. అభినందన్‌ను గనుక విడిచి పెట్టకపోతే.. రాత్రి 9 గంటలకల్లా పాకిస్థాన్‌పై భారత్ దాడి చేస్తుందని ఖురేషీ హెచ్చరించారు. ఆ సమయంలో ఆర్మీ ఛీఫ్ బజ్వా కాళ్లు వణకడం నేను గమనించాను." అని వ్యాఖ్యలు చేశారు అయాజ్.