తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఘజ్నవి' అణు క్షిపణి ప్రయోగించిన పాక్​ - పాక్​ బాలిస్టిక్​ అణు క్షిపణి పరీక్ష విజయవంతం

అణు సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణి 'ఘజ్నవి' శిక్షణ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది పాకిస్థాన్. ఘజ్నవి... ఉపరితలం నుంచి ఉపరితలంలోని 290 కి.మీ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలదు. ప్రయోగం విజయంపై పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ హర్షం వ్యక్తం చేశారు.

Pak conducts successful training launch of nuclear-capable ballistic missile Ghaznavi
'ఘజ్నవి' అణు క్షిపణి ప్రయోగించిన పాక్​

By

Published : Jan 23, 2020, 8:40 PM IST

Updated : Feb 18, 2020, 4:00 AM IST

అణు సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణి 'ఘజ్నవి' శిక్షణ ప్రయోగాన్ని పాకిస్థాన్​ విజయవంతంగా నిర్వహించింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోని 290 కి.మీ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం దీని సొంతం.

"పగలుతో పాటు రాత్రి సమయాల్లోనూ కార్యాచరణ సంసిద్ధతను పరీక్షించడమే లక్ష్యంగా ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్.. ఫీల్డ్ ట్రైనింగ్​ శిక్షణలో భాగంగా ఈ ప్రయోగం చేసింది."
- పాక్​ ఇంటర్ సర్వీసెస్​ పబ్లిక్ రిలేషన్స్​

ఇమ్రాన్ హర్షం

'ఘజ్నవి' పరీక్ష విజయంపై పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్ హర్షం వ్యక్తం చేశారు.

బెదిరింపులు సాగవ్​?

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసింది భారత ప్రభుత్వం. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన పాకిస్థాన్​... ఆగస్టు 29న 'ఘజ్నవి' క్షిపణి పరీక్షను నిర్వహించింది. చివరికి భారత్​తో తన ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకుంది దాయాది దేశం. భారత రాయబారిని బహిష్కరించింది. కానీ భారత్​ ముందు పాక్ పప్పులు ఉడకలేదు.

ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలని పాకిస్థాన్​ను గట్టిగా హెచ్చరించింది.

ఇదీ చూడండి:'టెల్కోలు ఏజీఆర్ చెల్లించకపోయినా చర్యలు తీసుకోవద్దు'

Last Updated : Feb 18, 2020, 4:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details