భారత విమానాలను తమ గగనతలంలోకి ప్రవేశించకుండా మరోసారి పూర్తి స్థాయిలో నిషేధం ప్రకటించింది పాకిస్థాన్. కరాచీలోని మూడు గగనతల మార్గాలను ఆగస్టు 28 నుంచి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ నిషేధంఅంతర్జాతీయ విమానయాన రంగంపై ప్రభావం చూపనుంది. ఇందుకు బదులుగా పైలట్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తోంది పాక్.
పాకిస్థాన్ రోడ్డు, గగనతల మార్గాల నుంచి... అఫ్గానిస్థాన్‌తో భారత్ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. వీటినీ నిలిపేయాలనే ఆలోచనతో పాకిస్థాన్ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ విషయంపై పాక్ ప్రధాని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇమ్రాన్ భారత్‌ను.. పాక్ గగనతలంలోకి పూర్తిగా నిషేధించేందుకు యోచిస్తున్నారని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ఇప్పటికే ట్వీట్ చేశారు.
బాలాకోట్ నుంచి మొదలైంది..