తెలంగాణ

telangana

ETV Bharat / international

'జమ్ముకశ్మీర్ నేతలతో మోదీ భేటీ పెద్ద డ్రామా'​ - modi meeting result

జమ్ముకశ్మీర్​ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశంపై పాకిస్థాన్​ విమర్శలు చేసింది. ఈ భేటీ ఓ పెద్ద డ్రామా అని వ్యాఖ్యానించింది. కశ్మీర్​ నేతలకు మోదీ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని ఆరోపించింది.

pak comments on modi kashmir leaders meeting
కశ్మీర్​ నేతలతో మోదీ భేటీపై పాక్​ విమర్శలు

By

Published : Jun 25, 2021, 10:20 PM IST

భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్​ మళ్లీ తలదూర్చింది. జమ్ముకశ్మీర్​ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశంపై విమర్శలు చేసింది. ఈ భేటీ 'ఓ పెద్ద డ్రామా' అని, 'పబ్లిసిటీ కోసమే సమావేశాన్ని నిర్వహించార'ని వ్యాఖ్యానించింది.

"నా దృష్టిలో ఇదో పెద్ద డ్రామా. ఎందుకంటే.. దీన్ని ఓ మంచి పబ్లిసటీ స్టంట్ అని చెప్పొచ్చు. ఈ భేటీ ద్వారా తేలింది ఏమీ లేదు. నేతలు చేసిన డిమాండ్​కు స్పష్టమైన సమాధానం ఏమీ రాలేదు. దానికి బదులుగా తగిన సమయంలో కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తామనే హామీ వచ్చింది. అది ఓ సందిగ్ధమైన ప్రకటన."

-మహమ్మద్ ఖురేషి, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి

ప్రధాని నిర్వహించిన సమావేశానికి ఆల్​ పార్టీస్​ హురియత్​ కాన్ఫరెన్స్(ఏపీహెచ్​సీ)ను ఆహ్వానించలేదని ఖురేషీ పేర్కొన్నారు. కశ్మీర్​లో జనాభాపరంగా మార్పులు తీసుకువచ్చేందుకు భారత్​ ప్రయత్నిస్తోందని ఖురేషీ ఆరోపించారు. భారత్​తో బ్యాక్​ డోర్​ దౌత్యవిధానాన్ని తాము అనుసరించటం లేదని స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్​ అంశంపై అక్కడి పార్టీల ప్రతినిధులతో దాదాపు 3 గంటలకుపైగా గురువారం సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. నియోజకవర్గాల పునర్విభజన, ఆపై ఎన్నికలు తదితర విషయాల గురించి కీలకంగా చర్చించారు. డీలిమిటేషన్​ ప్రక్రియ పూర్తయితే.. సత్వరమే ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసిన అనంతరం.. అక్కడి నేతలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య భేటీ జరగటం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఎన్నికలు జరిగినా ఆ అధికారాలు కేంద్రానివే!

ఇదీ చూడండి:ఆ ఒక్క పనితో 'రాజకీయ లెక్కలు' తారుమారు.. కానీ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details