తెలంగాణ

telangana

ETV Bharat / international

మారని పాక్​ వైఖరి.. 'కశ్మీర్​'పై అవే బూటకపు వ్యాఖ్యలు

ఐరాస భద్రతా మండలిలో చేదు అనుభవం ఎదురైనా కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​ వైఖరి మార్చుకోవటం లేదు. చైనా మినహా ఏ దేశమూ అండగా నిలవకున్నా రహస్య చర్చల అనంతరం కశ్మీర్​ గొంతును ప్రపంచానికి వినిపించామని బీరాలకు పోయారు.

మలీహా లోధి, ఐరాసలో పాక్​ రాయబారి

By

Published : Aug 17, 2019, 8:14 AM IST

Updated : Sep 27, 2019, 6:22 AM IST

మారని పాక్​ వైఖరి

కశ్మీర్​ అంశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సంప్రదింపుల్లో పాకిస్థాన్​కు ఓటమి తప్పలేదు. మండలిలో చైనా మినహా ఏ దేశమూ అండగా నిలవలేదని పాక్​ పత్రికలే కుండబద్దలు కొట్టాయి. కానీ భేటీ తర్వాత ఐరాసలో పాక్​ రాయబారి మాట్లాడుతూ.. విజయం సాధించామని బూటకపు వ్యాఖ్యలు చేసింది.

"కశ్మీర్​ ప్రజల గొంతును అంతర్జాతీయ అత్యున్నత సంస్థలో వినిపించగలిగాం. వాళ్లు ఒంటరి కాదు. భద్రతా మండలిలో వాళ్ల వేదన, పరిస్థితిని వివరించాం. జమ్ము కశ్మీర్​ వివాదంలో శాంతియుత పరిష్కారానికి మా దేశం కట్టుబడి ఉంది. ఈ సమావేశంలో కశ్మీర్​ తమ అంతర్గతమని చెబుతున్న భారత్​ వాదనను ఎవరూ సమర్థించలేదు. ఇప్పుడు కశ్మీర్​, అక్కడి పరిస్థితి గురించి ప్రపంచం చర్చిస్తోంది."

-మలీహా లోధి, ఐరాసలో పాక్​ రాయబారి

కశ్మీర్ అంశంపై ఐరాస భద్రతా మండలి జరిపిన రహస్య సమావేశం ఎలాంటి ఫలితంగా లేకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్​ తమ దేశ అంతర్గత విషయమని భారత్​ మరోసారి స్పష్టం చేసింది. ఇందులో ఇతరులు (పాక్) కలుగజేసుకునే అవకాశం లేదని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ఉగ్రకార్యకలాపాలు ఆపాలని భారత్ హితవు పలికింది.

ఇదీ చూడండి: 'కశ్మీర్ మా అంతర్గత విషయం..పాక్ జోక్యం అనవసరం'​

Last Updated : Sep 27, 2019, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details