భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లే ప్రయాణికులపై నిషేధం విధిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా కరోనా కేసులు భారీగా వెలుగుచూడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ నిషేధం మరో రెండు వారాల పాటు కొనసాగుతుందని పేర్కొంది.
ఇప్పటికే హాంకాంగ్, బ్రిటన్ ప్రభుత్వాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్‌ను ట్రావెల్ 'రెడ్ లిస్ట్'లో చేర్చతున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.