తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రతిపక్ష నేతలతో పాక్​ ఆర్మీ పెద్దల రహస్య భేటీ! - నవాజ్​ షరీఫ్

పాకిస్థాన్​లో అధికార పక్షం- ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది. ఆ తరుణంలో పాక్​ సైన్యం ప్రధాని ఇమ్రాన్​ వ్యతిరేక కూటమితో రహస్య సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ నిర్వహణలో సైన్యం పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

pak politics
పాక్​ ఆర్మీ రహస్య సమావేశం

By

Published : Sep 22, 2020, 6:06 PM IST

ప్రతిపక్ష నేతలతో పాక్​ ఆర్మీ పెద్దల రహస్య భేటీ!

ఒకవైపు ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ఆదే విపక్షాలతో పాక్​ ఆర్మీ ఛీఫ్​ జనరల్​ ఖమర్​ జావేద్​ బాజ్వా - ఐఎస్ఐ అధిపతి ఫయీజ్​ హమీద్ రహస్యంగా సమావేశమైనట్లు వస్తున్న వార్తలు పాకిస్థాక్​ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఈ నెల 16న బాజ్వా-హమీద్​లు రహస్యంగా 15మంది ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించినట్లుగా పాక్​ మీడియా పేర్కొంది. ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత షాబాజ్​ షరీఫ్​తో పాటు పాకిస్థాన్​ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్​ భుట్టో జర్దారీ సైతం పాల్గొన్నారు.

ఈ సమావేశం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించినట్లు పాక్​ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

అయితే, పాక్​ రైల్వే శాఖ మంత్రి షేక్​ రషీద్​ మాత్రం ఈ సమావేశం భారత్​ వ్యతిరేకిస్తున్న గిల్గిత్-బాల్టిస్థాన్​ గురించి జరిగిన వ్యూహత్మక చర్చలు మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతలు ఇతర అంశాలతో పాటు.. పాక్​ రాజకీయాల్లో క్రమంగా పెరుగుతున్న సైన్యం పాత్రపై చర్చినట్లు తెలుస్తోంంది. అదే సమయంలో పాకిస్థాన్​ పాలకుల జవాబుదారీతనంపై పలు అంశాలు లేవనెత్తారు.

పాకిస్థాన్​లో సైన్యం వ్యవహారంపై మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ వ్యంగ్యంగా స్పందించారు. దేశంలో ప్రభుత్వంపైన మరో ప్రభుత్వం పని చేస్తుందని పాక్​​ సైన్యాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి: జిన్​పింగ్​ను విమర్శించిన నేతకు 18 ఏళ్ల జైలు

సోమవారం సైన్యాధిపతి జనరల్​ బాజ్వా.. ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను ఆయన కార్యలయంలో కలిశారు. అయితే ఈ రహస్య సమావేశానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details